స్కూలు బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

 

స్కూలు బస్సుల ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. కండీషన్ సరిగా లేని బస్సులను, డ్రైవింగ్ సరిగారాని డ్రైవర్లను వినియోగిస్తూ వుండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వున్నాయి. శనివారం నాడు నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట మండలం సుగ్గుపల్లి - వెలగలపన్నూరు గ్రామాల మధ్యలో ఒక ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడి కండ్రిగలోని వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూలుకు చెందిన బస్సు విద్యార్థులను స్కూలుకు తీసుకుని వెళ్తూ వుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 35 మంది విద్యార్థులున్నారు. గాయపడిన విద్యార్థులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu