సమంతతో పెళ్ళి.. సిద్దార్థ్ ట్విస్ట్
posted on Jun 12, 2013 10:29AM

సమంత, సిద్దార్థ్ ల మధ్య 'సమ్‌థింగ్.. సమ్‌థింగ్' నడుస్తుందని, త్వరలో వాళ్ళు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సిద్దార్థ్ తన ప్రేమ పెళ్ళి పై మీడియా తో మాట్లాడారు. '' సహజంగా నిప్పులేనిదే పొగ రాదంటారు..కాని నా విషయంలో నిప్పు లేకుండానే పొగ వస్తుంది. నేను ఎవరితోనూ ఎలాంటి రిలేషన్ లో లేను. తల్లిదండ్రులు చూసే అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాను'' అని స్పష్టం చేశారు. సిద్దార్థ్, హన్సిక జంటగా సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్'. ఈ చిత్రం జూన్ 14న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ,తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది. బ్రహ్మానందం ఈ చిత్రంలో లవ్ గురు గా హైలెట్ కానున్నారు.