బెనిఫిట్ షో, టికెట్ రేట్స్ ఇలాగే ఉండాలి..తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ
on Jan 10, 2026

-తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
-మన శంకర వర ప్రసాద్ కి కలిసి వస్తుందా!
-మెగా, విక్టరీ మ్యానియా మొదలు
సెల్యులాయిడ్ పై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)మ్యానియాని మరోసారి వీక్షించడానికి మన శంకర వర ప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)ద్వారా కౌంట్ డౌన్ మొదలయ్యింది. ప్రచార చిత్రాలతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi)చెప్తున్న మాటల ద్వారా సరికొత్త చిరంజీవి ని చూడబోతున్నామని అభిమానులు, ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు.విక్టరీ వెంకటేష్(Venkatesh)కూడా యాడ్ కావడంతో రెట్టింపు అంచనాలు ఏర్పడ్డాయి. తెలంగాణ ఏరియాకి సంబంధించిన బుకింగ్స్ ఓపెనింగ్ కోసం అభిమానులు ఎదురుచూస్తు ఉన్నారు. ఈ క్రమంలో టికెట్స్ రేట్స్ పెంపు, బెనిఫిట్ షో కి సంబంధించిన రేట్లు ఏ విధంగా ఉండాలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)కొద్దీ సేపటి క్రితమే జీవో జారీ చేసింది.
Also read: షాద్‌నగర్ నుంచి తిరుమలకి బండ్ల గణేష్ మహా పాదయాత్ర.. హీరో ఫాన్స్ ఏమంటున్నారు
సదరు జీవో ప్రకారంఈనెల 11న ప్రీమియర్ షోస్ పడనున్నాయి. టికెట్ రేట్ 600. అదే విధంగా వారంరోజుల పాటు సింగిల్ స్క్రీన్లో GSTతో కలిపి 50 రూపాయలు మల్టీప్లెక్సుల్లో 100 రూపాయలు ప్రస్తుతం ఉన్న రేట్స్ కి యాడ్ కానున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు కి సంబంధించి బెనిఫిట్ షో, టికెట్ రేట్స్ పెంపుకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



