ప్రభాస్ కు వచ్చేఏడాది పెళ్ళి చేస్తాం: కృష్ణంరాజు
posted on Jun 13, 2013 10:45AM

ప్రముఖ హీరో ప్రభాస్ వివాహాం వచ్చే ఏడాది చేస్తామని ప్రభాస్ పెదనాన్న, ప్రముఖ నటుడు, నిర్మాత కృష్ణంరాజు చెప్పారు. ఆయన విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆగస్టులో ప్రభాస్ హీరోగా నిర్మించే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో ఓ పెళ్లికి హాజరయిన ప్రభాస్ కూడా తను వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని అన్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, దగ్గుబాటి రాణాల కాంబినేషన్ లో ’బాహుబలి’ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా నిర్మాణానికి దాదాపు ఏడాది కాలం పట్టేలా ఉంది. అందుకే ఈ సినిమా పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తోంది.