మాటివి అవార్డ్స్‌పై మహేష్ ఫైర్ !
posted on Jun 11, 2013 12:49PM

2012కు గాను మాటివి ఇవ్వనున్న అవార్డ్స్‌కుగాను "బిజినెస్‌మేన్" చిత్రాన్ని "ఉత్తమ నటుడు" అవార్డ్స్ కోసం నామినేట్ చేయకపోవడం పట్ల మహేష్‌బాబు తన ట్విట్టర్ ద్వారా నిరసన వ్యక్తం చేసారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే మహేష్‌బాబు తన ట్విట్టర్ ద్వారా మాటివి అవార్డ్స్‌పై మండిపడడం సహజంగానే చర్చనీయాంశమవుతోంది.
"2012 మా అవార్డ్స్ కోసం బెస్ట్ యాక్టర్ కేటగిరీలో "బిజినెస్‌మేన్"ను నామినేట్ చేయకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటె నేను అత్యుత్తమ నటన కనబరిచిన చిత్రాల్లో "బిజినెస్‌మేన్" ఒకటి" అంటూ మహేష్‌బాబు ట్వీట్ చేసారు.
"ఒన్ నేనొక్కడినే" షూటింగ్ కోసం నేనో రెండు నెలలపాటు విదేశాలలో ఉండబోతున్నాను. అవార్డ్స్ ఫంక్షన్‌కు హాజరయ్యే అవకాశం లేదు కాబట్టి.. నన్ను నామినేట్ చేసి ఉండరు" అంటూ దెప్పిపొడిచారు కూడా మహేష్‌బాబు!