లారీ నిండా వయాగ్రాలు

 

ఈ సంఘటనని సినిమావాళ్ళు చక్కగా కొట్టేసి ఏదైనాసినిమాలో పెట్టుకోవచ్చు. ముగ్గురు దొంగలు. నేషనల్ హైవేలో దాభాల దగ్గర ఆగివున్న లారీలని దొంగిలించి, ఆ తర్వాత ఆ లారీని, ఆ లారీలో వున్న సరుకుని అమ్ముకుంటారు. రెండ్రోజుల క్రితం ఢిల్లీ దగ్గర్లో ఉన్న ఒక డాభా ముందు ఆపి వున్న లారీని కొట్టేశారు. చక్కగా లారీ నడుపుకుంటూ రోడ్డుమీద దూసుకుపోతున్నారు. ఇంతలో రోడ్డు మీద పోలీసులు లారీని ఆపారు. లారీలో ఏమున్నాయ్ అని అడిగారు. పాపం ఈ ముగ్గురికి లారీలో ఏం వున్నాయో ఏం తెలుసు? నీళ్ళు నమిలారు. పోలీసులు లారీలో తనిఖీలు చేసి నోళ్ళు తెరిచారు. ఆ లారీలో షాంపూలు, అగరబత్తీల ప్యాకెట్లు పైన పెట్టి వున్నాయి. కింద మాత్రం వయాగ్రా టాబ్లెట్లున్న బోలెడన్ని అట్టపెట్టెలున్నాయిమరి. లారీ నిండా వున్న వయాగ్రా టాబ్లెట్ల డబ్బాలు చూసి పోలీసులతోపాటు దొంగలు కూడా నోళ్ళు తెరిచారు. ఇప్పుడు లారీని దొంగిలించిన కేసుని విచారించడంతోపాటు, లారీడు వయాగ్రాలు రవాణా చేస్తున్న అసలు వ్యక్తులెవరో కూడా తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు వున్నారు. మొత్తమ్మీద ఎలాగూ లారీడు వయాగ్రా టాబ్లెట్లున్నాయి.. పోలీసులలోనే ఎవరికైనా ఓ గుప్పెడు వయాగ్రా టాబ్లెట్లు జేబులో వేసుకోవాలన్న ఆలోచన రాకుండా వుంటుందా?