శాసనసభ్యుడు- అత్యాచారం చేసి పారిపోయాడు!
posted on Feb 20, 2016 9:20AM

నాయకుడంటే తండ్రి తరువాత తండ్రిలాంటి వాడంటారు. కానీ బీహార్లోని ఓ శాసనసభ్యుడు ఉచ్ఛనీచాలను మర్చిపోయాడు. రాజ్‌వల్లభ్ యాదవ్ అనే ఆ RJD శాసనసభ్యుడు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేశాడు. ఆ విషయం బయటపడటంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రాజ్‌వల్లభ్‌కి స్థానిక పోలీసుల అండ కూడా పుష్కలంగా ఉందని తెలియడంతో గ్రామస్తులంతా తిరగబడ్డారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ దృష్టికి ఈ నేరాన్ని తీసుకువెళ్లారు. అంతేకాదు, రాజ్‌వల్లభ్ బలవంతుడు కాబట్టి అతను తిరిగివచ్చాక హాయిగా బెయిలుని పొందుతాడని వారికి తెలుసు. అందుకే వారంతా కలిసి బాధితురాలి తండ్రికి న్యాయపోరాటం చేసేందుకు అవసరమయ్యే ధనసహాయం కోసం విరాళాలను సేకరిచారు. గ్రామస్తుల పట్టుదలకు ప్రభుత్వం సైతం తల ఒగ్గక తప్పలేదు. ఎమ్మెల్యేని వీలైనంత తొందరగా అరెస్టు చేసేందుకు ఘటన జరిగిన నలంద జిల్లాకు ఒక కొత్త ఎస్పీని నియమించింది.