బంగ్లా టూర్ కు పంత్ ఔట్

రిషభ్ పంత్ వరుస వైఫల్యాలతో సతమతమౌతున్న టీమ్ ఇండియా క్రికెటర్ బంగ్లాదేశ్ పర్యటనకు దూరం అవుతాడా? అతడి పేరును సెలక్టర్లు బంగ్లా  టూర్ కు దూరం పెట్టేయాలని డిసైడయ్యారా? అంటే క్రికెట్ నిపుణులు ఔననే అంటున్నారు.

అయితే గాయం కారణంగానే పంత్ బంగ్లాటూర్ కు దూరమయ్యే అవకాశాలున్నాయని టీమ్ ఇండియా ఆటగాళ్లు చెబుతున్నారు. పంత్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అయినా అతడికి మరి కొన్ని అవకాశాలు ఇవ్వాలని టీమ్ ఇండియా మేనేజ్ మెంట్, బీసీసీఐ, సెలక్షన్ కమిటీ భావిస్తోందంటున్నారు.

అద్భుత మైన టాలెంట్ ఈ యువ క్రికెటర్ సొంతమని చెబుతున్నారు. అందుకే ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నా పంత్ కు వరుస అవకాశాలు ఇస్తున్నారంటున్నారు. అయితే కివీస్ తో రెండు రోజుల కిందట జరిగిన మూడో వన్డేలో రిషభ్ పంత్ కేవలం పది పరుగులకే ఔటై పెవిలియన్ చేరాడు.

కానీ ఆ తరువాత అతడు స్ట్రెచర్ పై పడుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో  తెగ వైరల్ అయ్యాయి. దీంతో రిషబ్ పంత్ గాయపడ్డాడా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పంత్ బంగ్లా టూర్ కు దూరం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.