దొర పాలిట య‌ముడు.. రేవంతే అస‌లైన మొగుడు...

గ‌జ్వేల్‌లో దుమ్మురేగింది. కేసీఆర్ ఇలాఖాలో భూకంపం వ‌చ్చింది. 2 ల‌క్ష‌ల మంది రేవంత్ సైన్యం ప‌ద‌ఘ‌ట్ట‌న‌ల‌తో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ప్ర‌కంప‌ణ‌లు వ‌చ్చాయి. ద‌ళిత గిరిజ‌న దండోరా స‌భ‌లో వినిపించిన నినాదాలకు కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో అద్దాలు ప‌గిలాయంటున్నారు. కాంగ్రెస్ స‌భ సూప‌ర్ స‌క్సెస్‌. రేవంత్‌రెడ్డి మీటింగ్ అదుర్స్‌. ల‌క్ష దాటుతార‌నుకోగా.. 2 ల‌క్ష‌ల జ‌నం రావ‌డం హస్తం పార్టీపై పెరుగుతున్న ఆద‌ర‌ణ‌కు సాక్షం. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వ ప‌టిమ‌కు నిద‌ర్శ‌నం. 

రాహుల్‌గాంధీ రాక‌పోవ‌డం ఒక్క‌టే మైన‌స్‌. మిగ‌తా స‌భ అంతా గ్రాండ్ స‌క్సెస్‌. గ‌జ్వేల్‌లో ద‌ళిత గిరిజ‌న దండోరాతో సంచ‌ల‌నం సృష్టించారు రేవంత్‌రెడ్డి. స‌భ‌కు వ‌చ్చిన జ‌నం.. ఆయ‌న ఇచ్చిన స్పీచ్‌.. అంతా హ‌ల్‌చ‌ల్‌. వీట‌న్నిటితో పాటు మ‌రో విష‌యం కూడా ఇంట్రెస్టింగ్‌. అదే ఈ క‌టౌట్‌...

చూశారుగా. క‌టౌట్‌లో ఉన్న‌ది రేవంత్‌రెడ్డినే. య‌ముడి గెట‌ప్‌లో ఉన్నాడు. మామూలుగా అయితే య‌ముడిని నెగ‌టివ్ షేడ్‌లో చూస్తారు. అందుకే, య‌ముడి గెట‌ప్‌లో ఫ్లెక్సీ వేయ‌డానికి ఎవ‌రూ ముందుకు రారు. కానీ, రేవంత్‌ను య‌ముడి రూపంలో ఇలా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయ‌డానికి స్ట్రాంగ్ రీజ‌నే ఉంది. ఊరికే పెట్ట‌లేదు య‌ముడి క‌టౌట్‌. దాని వెనుక అర్థం..ప‌ర‌మార్థం ఉంది. అదే ఈ ఫ్లెక్సీకి ట్యాగ్ లైన్ కూడా.

దొర పాలిట య‌ముడు. ఈ టైటిల్‌తోనే కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో, గ‌జ్వేల్ ఫామ్‌హౌజ్‌లో ఉండే దొర కేసీఆర్‌ పాలిట య‌ముడు రేవంత్‌రెడ్డి అనే మీనింగ్‌తో ఈ భారీ కటౌట్‌ను పెట్టారు. స‌భ‌కు వ‌చ్చిన వారంతా య‌ముడు గెట‌ప్‌లో ఉన్న రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీని చూసి తెగ ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. ముందు రేవంత్‌రెడ్డి ఏంటి.. య‌ముడి గెట‌ప్ ఏంట‌ని కాస్త సందేహించినా.. క‌టౌట్‌కు ఉన్న టైటిల్‌ను చూసి ఖుషీ అయ్యారు. అవును, నిజ‌మే. దొర పాలిట య‌ముడు రేవంత్‌రెడ్డినే అంటూ చ‌ర్చించుకున్నారు. 

ఈ క‌టౌట్‌ను కూడా చాలా క్రియేటివ్‌గా సెట్ చేశారు. బ్లాక్ క‌ల‌ర్ పంచె, నెత్తిన కిరీటం.. చిన్న గ‌డ్డంతో.. రేవంత్‌రెడ్డి య‌ముడి గెట‌ప్‌లో భ‌టే షూట్ అయ్యారు. మొత్తం స‌భ‌లో ఈ ఫ్లెక్సీ మేట‌ర్ గురించే చ‌ర్చ‌. పెట్టింది ఎవ‌రో గానీ.. ఐడియా అదుర్స్‌....
 

Related Segment News