కిషన్‌రెడ్డికి ప్రమోషన్.. రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్..! ఆయనకు పదవితో ఈయనకు బ్రేకులు..?
posted on Jul 7, 2021 7:41PM
కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రిగా ప్రమోషన్. కేంద్ర కేబినెట్‌లో ఏకైక తెలుగువాడిగా అందలం. రెండేళ్లుగా హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.. బాగానే రాణిస్తున్నారు. ప్రస్తుత కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ దాదాపు ఎలక్షన్ బేస్డ్‌గానే జరిగిందనే టాక్. మరి, తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎలాంటి ఎన్నికలూ లేవు. కిషన్‌రెడ్డి ప్రస్తుతం కీలక పదవిలోనే ఉన్నారు. అయినా.. ఆయన్ను ఏరికోరి మరీ ప్రమోషన్ ఎందుకు ఇచ్చినట్టు? ఓవైపు ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్‌లాంటి వారినే కేబినెట్ నుంచి తప్పించగా.. కిషన్‌రెడ్డికి మాత్రం ఎందుకు మరింత ప్రాధాన్యం కల్పించారు? అంటే ఢిల్లీ వర్గాల్లో ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఏ రాష్ట్రాల్లోనైతే ఎన్నికలు ఉన్నాయో.. ఏయే చోట్లైతే బీజేపీ బలహీనంగా ఉందని భావించారో.. ఆయా ప్రాంత నేతలకు ఈసారి కేబినెట్‌లో చోటు దక్కింది. తెలంగాణలో ఇటీవల ఈటల రాజేందర్ చేరికతో పార్టీ మరింత బలోపేతమైంది. బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ దూకుడుగానే ముందుకు సాగుతోంది. మరి, కిషన్‌రెడ్డికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు? మరో రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసమని కూడా అనలేం. మరెందుకు అంటే.. పీసీసీ కొత్త చీఫ్ రేవంత్‌రెడ్డి వల్లే కిషన్‌రెడ్డికి ప్రమోషన్ వచ్చిందని అంటున్నారు.

కర్ణాటక తర్వాత దక్షిణాదిన అధికారంలోకి రాగల అవకాశం ఉన్న రాష్ట్రం తెలంగాణనే అని బీజేపీ బలంగా నమ్ముతోంది. కాస్త గట్టిగా ప్రయత్నిస్తే.. ఈజీగా గెలిచేయొచ్చనేది వారి అంచనా. బండి సంజయ్, ఈటల రాజేందర్‌లతో బీజేపీ దళం పటిష్టంగానే ఉంది. ఇక కేసీఆర్‌కు సాటి మేమేనంటూ.. అందుకు దుబ్బాక, జీహెచ్ఎమ్‌సీ ఎన్నికలే సాక్షమంటూ కమలనాథులు బిందాస్‌గా ఉన్నారు. కానీ, వారి స్వీట్ డ్రీమ్స్‌ను బ్రేక్ చేస్తూ.. చిచ్చరపిడుగు రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా పిడికిలి బిగించడంతో కాషాయం పార్టీ కంగుతింది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ మన్నుతిన్న పాములా పడుండటంతో.. కేసీఆర్‌నే టార్గెట్ చేస్తూ రాజకీయంగా నెగ్గుకొచ్చిన బీజేపీకి రేవంత్ ఎంట్రీ అంత ఈజీగా మింగుడు పడటం లేదంటున్నారు. ఫేస్ టు ఫేస్ ఫైట్ కాస్తా.. ట్రయాంగిల్ వార్‌గా మారడం.. పీసీసీ పగ్గాలు రేవంత్‌రెడ్డి చేతికి రావడంతో.. పొలిటికల్ ఎడ్జ్ కాంగ్రెస్ వైపు షిప్ట్ అవుతుండటంతో కమలనాథుల్లో కలవరింత పెరిగిపోయింది. అందుకే, రేవంత్‌రెడ్డి బీజేపీని ఎంతగా కవ్విస్తున్నా.. ఎక్కడా టెంప్ట్ అవకుండా.. రేవంత్‌పై ప్రతివిమర్శలు చేసి ఆయన రేంజ్‌ను మరింత పెంచేయకుండా.. వ్యూహాత్మక మౌనం పాటిస్తూ.. ప్రస్తుతానికైతే ఎలాగోలా మేనేజ్ చేసుకొస్తున్నారు. కానీ, ఈ స్ట్రాటజీ ఎన్నో రోజులు వర్కవుట్ కాదని బీజేపీకీ తెలుసు. హుజురాబాద్ గండం గట్టెక్కే వరకూ రేవంత్ విషయంలో సైలెంట్‌గా ఉండాలనేది బీజేపీ ప్లాన్.
ఇక పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పేరు ప్రకటించగానే.. ఆయన కేసీఆర్‌తో పాటు కిషన్‌రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ ఘాటైన విమర్శలు చేశారు. కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు ఏజెంట్ అని.. ఈటలను బీజేపీలో చేర్చింది కేసీఆరేనని.. కేసీఆర్ అరేంజ్ చేసిన ఫ్లైట్‌లోనే కిషన్‌రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చి ఈటలతో చర్చలు జరిపారంటూ.. కాక రేపారు రేవంత్‌రెడ్డి. ఇలా, బీజేపీ-టీఆర్ఎస్ ఒక్కటేననే అనుమానం కలిగించి.. కేసీఆర్‌కు కాంగ్రెస్సే అసలైన ప్రత్యర్థి అనే అభిప్రాయం ప్రజల్లో కలిగేలా.. రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా విమర్శలు చేశారు. రేవంత్ మైండ్‌గేమ్‌తో బీజేపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినంత పనైంది.
రేవంత్‌రెడ్డి దూకుడు మామూలుగా లేదని.. ఆయన్ను అలానే వదిలేస్తే.. తెలంగాణలో అధికారంలోకి రావాలనే బీజేపీ డ్రీమ్ ఏనాటికి నెరవేరదనే కంగారు కాషాయ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే, రేవంత్‌రెడ్డి దూకుడుకు బ్రేకులు వేయాలనే గేమ్ ప్లాన్‌లో భాగంగానే.. కిషన్‌రెడ్డిని మరింత బలవంతుడిని చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మంచి పదవిలోనే ఉన్న కిషన్‌రెడ్డికి మరింత ప్రమోషన్ కల్పించడం తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే ఉద్దేశ్యం కంటే.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కట్టడి చేసే వ్యూహమే ఎక్కువగా ఉందని విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. కాంగ్రెస్ ముక్త్ భారతే.. బీజేపీ ప్రధాన లక్ష్యం. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ బలం పుంజుకోవడం బీజేపీకి అసలేమాత్రం ఇష్టం ఉండదు. అందుకే, రేవంత్‌రెడ్డికి పోటీగా బీజేపీని మరింత అగ్రెసివ్‌గా మార్చడానికే అన్నట్టు..కిషన్‌రెడ్డికి మరింత ప్రాధాన్యం కల్పించి.. కేంద్ర మంత్రిని చేశారనేది ఢిల్లీ వర్గాల మాట. ఎంతైనా.. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్ మామూలుగా లేదుగా... రేవంత్‌కి పీసీసీ పగ్గాలతో అన్ని పార్టీల ఈక్వేషన్స్ అమాంతం మారిపోతున్నాయి.. రేవంత్‌రెడ్డి రాకతో ప్రగతిభవన్‌కు గట్టి షాక్... బీజేపీకి దిమ్మ తిరిగే ఝలక్... రేవంత్‌రెడ్డా.. మజాకా.....