పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ..కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్

దేశంలోనే అతి పెద్ద నగరంగా ఆవిర్భవించనున్న హైదరాబాద్ మహానగరంలో పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ ప్రభుత్వం సోమవారం (డిసెంబర్ 29) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.  పాలనా సౌలభ్యం లక్ష్యంగా  జీహెచ్‌ఎంసీ పరిధికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న మూడు పోలీస్ కమిషనరేట్ల సర్వరూపం, సరిహద్దులను మార్చింది. ట్యాంక్‌బండ్ నుంచి శంషాబాద్ వరకు హైదరాబాద్ కమిషనరేట్  ఏర్పాటు చేసింది.   సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణపై హోం శాఖ, డీజీపీ, ముగ్గురు కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారు పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి చేసిన తుది ప్రతిపాదనలకు సర్కార్ ఓకే చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ మేరకు  జీహెచ్‌ఎంసీ వార్డులు, సర్కిళ్లు, జోన్ల ఆధారంగానే పోలీస్ స్టేషన్లు, డివిజన్లు, జోన్ల ఉంటాయి.  
 ప్రస్తుతం మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న 16 పోలీస్ జోన్లను, జీహెచ్‌ఎంసీ జోన్లకు అనుగుణంగా 12కు కుదించారు. 
  ప్రస్తుతం రాచకొండ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి జోన్‌ను తొలగించి  దానిని ప్రత్యేక జిల్లా ఎస్పీ పరిధిలోకి తీసుకువచ్చారు. 

 ఈ పునర్వ్యవస్థీకరణతో, కమిషనరేట్ల పరిధులు  మారిపోయాయి. 
 శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఉన్న పోలీస్ స్టేషన్లను   హైదరాబాద్ కమిషనరేట్‌ విలీనమయ్యాయి. రాచకొండ కమిషనరేట్ పేరును  మహంకాళి లేదా  లష్కర్ కమిషనరేట్ గా మార్చే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.  

సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు ప్రాంతంలోని కొన్ని పోలీస్ స్టేషన్లను సైబరాబాద్‌లో విలీనం అయ్యాయి. క మరోవైపు ట్యాంక్‌బండ్‌ నుంచి ప్రస్తుతం ఉన్న కొన్ని ఠాణాలతో పాటు సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలోని పలు పోలీస్‌ స్టేషన్లను హైదరాబాద్‌ కమిషనరేట్‌లో కలిపింది.
ముఖ్యంగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ఉన్న పోలీస్‌ స్టేషన్లను హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోకి తీసుకురానున్నారు.

ఈ క్రమంలో ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్‌, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, ఆదిభట్ల‌, సనత్‌నగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్‌, బాలాపూర్‌ తదితర ఠాణాలు హైదరాబాద్‌ కమిషనరేట్‌లో విలీనం అవుతాయి. ఈ మూడుకమిషనరేట్ లకు అదనంగా గా ఫ్యూచర్ సిటి కమిషనరేట్ ను ఏర్పాటు చేసి.. ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా సుధీర్ బాబును నియమించింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu