తెలంగాణలో మల్టీప్లెక్స్ లకు ఊరట.. రాత్రి 11 తర్వాత పిల్లలకు అనుమతి
posted on Mar 1, 2025 1:40PM
తెలంగాణలో మల్టీప్లెక్స్ లకు ఊరట కలిగించే విధంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోలపై విచారణ సందర్బంగా జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసిన తెలిసిందే. 16 ఏళ్ల లోపు పిల్లలకు అనుమతినిరాకరిస్తూ హైకోర్టు ఉత్తర్వులపై మల్టీప్లెక్స్ యాజమాన్యం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. పిల్లల ప్రవేశాన్ని అనుమతించకపోవడం వల్ల ఆర్థికంగా నష్ట పోతున్నట్లు తెలిపింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు హైకోర్టు విధించిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరింది. వారి వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. పిల్లలకు అన్ని షోలకు అనుమతిస్తూ తీర్పు చెప్పింది. తెలంగాణలో బెనిఫిట్ షో, ప్రీమియర్ . స్పెషల్ షోలకు అనుమతి నిరాకరిస్తూ హైకోర్టు సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. 16 ఏళ్ల లో పు పిల్లలకు అన్ని షోలకు అనుమతిస్తూ హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసింది.