లవరే రేపిస్టు
posted on Apr 6, 2015 10:14AM

ఎంతగానో ప్రేమించిన లవరే రేపిస్టు అయ్యాడు. వాడు రేపిస్టు కావడం మాత్రమే కాదు.. తన ఫ్రెండ్స్‌తో కూడా ఆమె మీద అత్యాచారం చేయించాడు. తన లవర్ చేసిన ఘోరాన్ని వివరిస్తూ ఒక టీనేజ్ యువతి హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీసులకు ఆదివారం రాత్రి ఫిర్యాదు చేసింది. డార్జిలింగ్కు చెందిన ఆమె ఒక ప్రైవేట్ బ్యూటీపార్లర్లో పనిచేస్తూ గాంధీనగర్లో నివసిస్తోంది. ఒక యువకుడితో ప్రేమ వ్యవహారం కూడా నడుపుతోంది. అయితే ఆదివారం రాత్రి తన బాయ్‌ఫ్రెండ్ కొంతమంది స్నేహితులను తీసుకుని వచ్చిన తనమీద అత్యాచారం చేశారని ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె ప్రియుడితో పాటు అతని స్నేహితులపై కేసు నమోదు చేశారు. ఆ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.