సిద్ధయ్య ఆరోగ్యం మరింత క్షీణించింది
posted on Apr 6, 2015 10:26AM

నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం-చిన్నకోడూరు మధ్య సిమి తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆత్మకూరు (ఎం) ఎస్ఐ జూలూరి సిద్ధయ్య ఆరోగ్యం మరింత క్షీణించింది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలోని ఆయన వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. ఆయన అపస్మారక స్థితిలోనే వున్నారు. సిద్ధయ్య శరీరం నుంచి మూడు బుల్లెట్లు తొలగించారు. మెదడులో వున్న ఒక బుల్లెట్‌ని తీయాల్సి వుంది. ఈ బుల్లెట్ తొలగించే విషయంలో డాక్టర్లు ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. ఆ బుల్లెట్ తీయడం మరింత ప్రమాదకరం అయ్యే అవకాశం వుందని భయపడుతున్నారు. ఇదే ఆస్పత్రిలో ఎస్ఐ సిద్ధయ్య భార్య ధరణిష ఓ మగబిడ్డకు జన్మించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఐ సిద్ధయ్యతో పాటు పుట్టిన బిడ్డను కూడా చూసేందుకు అనేకమంది తరలి రావటంతో ఆ బాబుకు ఇన్ఫెక్షన్ సోకినట్టు తెలుస్తోంది.