హాం ఫట్.. అధికారుల భూమ్ ఫట్

 

అవినీతి అనగానే రాజకీయ నాయకులే గుర్తొస్తారు. అందులోనూ ప్రభుత్వ భూముల ఆక్రమణ,అంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అయ్యే పని కాదని అనుకుంటాము, కానీ, అది సంపూర్ణ సత్యం కాదు. రాజకీయ నాయకులలో ఎక్కడో అక్కడ ఒకరో ఇద్దరో నిజాయతీ పరులు ఉన్నట్లుగానే, ప్రభుత్వ అధికారులలోనూ, ప్రభుత్వ భూములను ఇతరత్రా భూమలను అక్రమంగా సొంత చేసుకోగల సమర్ధులు ఉంటారు.ఉన్నారు.అంతే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  అవినీతి గ్రాఫ్’ కు పార్లర్’గా అవినీతి అధికారుల గ్రాఫ్’కూడా పెరుగుతోందని’ అధికార వర్గాల్లోనే వినిపిస్తోంది.నిజానికి ఇంటి దొంగను ఈశ్వరుడు అయిన పట్టలేరు అంటారు, కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సార్ల భూదందా, అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే వుంది. సంచలనం అవుతోంది.  ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం పరిధిలోని భూదాన్ భూములకు సంబంధించి సంచలనమ మారిన వివదాన్నే తీసుకుంటే, తెలంగాణ హై కోర్టు ఈ కేసులో చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. 

ఈ కేసులో, ఆరోపణలు ఎదుర్కుంటున్న వారంతా, ఉన్నత స్థానాల్లో ఉన్న,ఉన్నతాదికారులని,అలాగే, వారిపై  రోపణలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. రాష్ట్ర హై కోర్టు ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేసిందంటే, పెద్ద సార్లు, భూదందాలో ఎంతటి సమర్ధులో  వేరే చెప్ప నక్కర లేదు. అంతే కాదు, రాష్ట్ర హై కోర్టు’ రాష్ర వ్యాప్తంగా భూదాన భూముల దురాక్రమణలు, అక్రమాల పై విచారణ జరిపి నిజాలను నిగు తేల్చేందుకు సిబిఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఇందుకు సంస్థ సంసిద్ధంగా ఉందా, లేదా తెలియచేయాలని సిబిఐకి నోటీసులు జారీ చేసింది.అంతే కాదు, ఈ భూముల్లో అక్రమాలు జరిగాయని, పలువురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు జరపవద్దని స్పష్టం చేసింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వంతో పాటు ఇడి, సిబిఐ, పిటిషన్‌లో పేర్కొన్న అధికారులు,వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. మహేశ్ అనే వ్యక్తి ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు,వారి కుటుంబసభ్యులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. 

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, భూదాన్ బోర్డుకు గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేలాలంటే సిబిఐ లేదా ఇడి వంటి స్వతం త్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ అం శంపై సమగ్ర విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. దర్యాప్తు జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు.తదుపరి విచారణను హైకోర్టు జూన్ 26కు వాయిదా వేసింది. భూములకు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగాయనే అభియోగాలపై విచారణకు ముగ్గు రు సభ్యులతో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, రఘునందన్‌రావు, శశాంక్‌లతో కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పింది. 

నాగారం గ్రామంలోని సర్వే నెం.181,182లో 103.22 ఎకరాల భూదాన్ భూముల అక్రమాలపై కూడా అదే కమిటీ విచారిస్తున్నదని గతంలోనే హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది.అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అక్రమ సంపాదనతో, బినామీ పేర్లతో  రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పెద్ద సార్లు ఐఎఎస్,ఐపీఎస్’లు,ఉన్నారని,అంటున్నారు. అవునుమ నలుపును తెలుపు చేసుకునేందుకు, కాకుంటే, గుట్టుచప్పుడు కాకుండా దోచిన సొమ్ములను దాచుకునేదుకు పెద్ద సార్లు,రియల్ వ్యాపారాన్ని నమ్ముకునారని అంటారు. నిజానికి బయటకు వస్తున్నది, చాలా తక్కువ అంటున్నారు. విశాఖ, విజయవాడ, హైదరాబద్’ సహా అనేక ప్రధాన నగరాలు, పట్టణాలలో, కొండకచో ఇతర రాష్ట్రాల్లోనూ, పెద్ద సార్లు రియల్’ దందాను దిగ్విజయంగా నడుపుతున్నారనే ఆరోపణలకు కొదవ లేదు. అయితే, అంతిమంగా ఏమి జరుగుతుంది, ఆవినీతికి సంకెళ్ళు పడతాయా అంత అనుమానమే అంటున్నారు