ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
posted on May 21, 2025 8:54PM
.webp)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌పై భద్రతా బలగాలను ప్రధాని మోదీ ప్రశంసించారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన పోస్టును ప్రధాని నరేంద్ర మోదీ రీపోస్ట్ చేస్తూ భద్రతా బలగాలను ప్రశంసించారు. మీ అద్భుత విజయాన్ని చూసి గర్వపడుతున్నాను. మావోయిజం ముప్పును పూర్తిగా తొలగించి, ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ప్రధాని ఎక్స్ ద్వారా ప్రధాని తెలిపారు.
మాధ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న విశ్వనీయ సమాచారంతో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మృతి చెందారు. ఇందులో సీపీఐ మావోయిస్ట్ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా ఉన్నారు. నక్సల్స్ ఉదమ్యానికి నంబాల వెన్నెముకగా నిలిచారు. నక్సలిజాన్ని అంతమొందించడంలో ఇది కీలక ముందడుగు.