కార్మికుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం..షర్మిల సంచలన ప్రకటన

 

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిరవధిక నిరాహా దీక్ష చేపట్టారు.  స్టీల్ ప్లాంట్ లో ఆకారణంగా విధుల నుంచి తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిసి దీక్షకు దిగారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఇతర డిమాండ్లను కూడా యాజమాన్యం పరిష్కరించాలని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న షర్మిల.. స్టీల్ ప్లాంట్ వద్ద దీక్ష ప్రారంభించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు. 

అదానీకి మేలు చేసేందుకు స్టీల్ ప్లాంట్‌ను చంపేస్తున్నారని ఆమె తెలిపారు. విశాఖ కార్మికుల కోసం ప్రాణ త్యాగం చేసేందుకైనా నేను సిద్దం అని షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్లాంట్ లాభాల్లో ఉండేది. బీజేపీ ప్రభుత్వం రాగానే నష్టాలు అంటూ అందరినీ మోసం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్లాంట్ అభివృద్ధికి రూ.11వేల కోట్లు ఇచ్చినట్లు కేంద్రం చేసిన ప్రకటనలు అన్నీ పచ్చి అబద్ధం. ఇచ్చినట్లే ఇచ్చి రూ.8వేల కోట్లు బ్యాంక్ రుణాల కింద వెనక్కి తీసుకున్నారు. మరో రూ.3వేల కోట్లు ఇవ్వాలంటే 5వేల మంది ఉద్యోగులను తొలగించాలని కండీషన్ పెట్టారని  షర్మిల తెలిపారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu