మహిళ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
posted on Sep 22, 2025 9:53PM
.webp)
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కిస్మత్పూర్ బ్రిడ్జి కింద ఓ మహిళా మృతదేహం లభ్యం కావడం తీవ్ర సంచ లనాన్ని సృష్టించింది. అయితే ఈ కేసును పోలీసులు ఛేదించి నిందితులను పట్టుకొని చెరసాలలో వేశారు. ఓ వివాహిత ఆదివారం మధ్యాహ్నం సమయంలో యాకత్పురా నుండి హైదర్‌గూడకు వచ్చింది... హైదర్ గూడా లో ఉన్న కల్లు కాంపౌండ్ లో కూర్చుని ఫుల్లుగా కల్లు సేవించింది. ఆ మద్యం మత్తులో కల్లు కాంపౌండ్ నుండి బయటికి వచ్చి రోడ్డు మీద పడిపోయింది. టోలిచౌకి కి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లు అదే సమయానికి కల్లు కంపౌండ్ కు వచ్చారు. ఈ మానవ మృగాలు మహిళ కదలికలు గమనించి ఆమెపై కన్ను వేశారు.
మద్యం మత్తులో పడి ఉన్న మహిళ ను బలవంతంగా ఆటోలో ఎక్కించు కొని... రాజేంద్రనగర్ కిస్మత్పూర్ బ్రిడ్జి కిందకు తీసుకువెళ్లి ఆమెకి ఫుల్లుగా మద్యం తాగిం చారు... వారు కూడా ఫుల్లుగా మద్యం సేవించారు. అనంతరం ఈ మృగాలు మద్యం మత్తులో ఉన్న ఆ మహిళపై ఒకరి తర్వాత ఒకరు కామవాంఛ తీర్చుకున్నారు. అయినా కూడా ఈ మృగాలు ఆ మహి ళను వదిలిపెట్ట లేదు. ఈ కామాంధులు తమకు సరైన రీతిలో సహకరించడం లేదంటూ విచక్షణ కోల్పోయి మృగాల్లా ప్రవర్తిస్తూ మహిళను పూర్తిగా వివస్థగా చేసి దిగంబరంగా మార్చి వేసి అత్యంత క్రూరంగా హత్య చేసి అనంతరం అక్కడి నుండి పారిపోయారు. రాజేంద్రనగర్ ఎస్ఓటి బృందం గత ఐదు రోజుల పాటు ఈ మృగాల కోసం వేట కొన సాగించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నాంపల్లి నుండి రాజేంద్ర నగర్, హైదర్‌గూడ వరకు ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించడంతో ఈ కామాంధుల గురించి తెలిసింది. దీంతో పోలీసులు ఇద్దరు ఆటో డ్రైవర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు