రజత్ గుప్తాకు రెండేళ్ల జైలుశిక్ష
posted on Oct 26, 2012 2:33PM

గోల్డ్ మాన్ శాచ్ సహా పలు అంతర్జాతీయ సంస్థల్లో కీలక పదవులు నిర్వహించిన భారత సంతతికి చెందిన వాల్ స్ట్రీట్ దిగ్గజం రజత్ గుప్తాకి అమెరికా ఫెడరల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షతోపాటు 5 మిలియన్ అమెరికా డాలర్ల జరిమానాను విధించింది. ఈ తీర్పుతో రజత్ గుప్తా పూర్తిగా చతికిలపడిపోయారు. జీవితకాలంపాటు నిర్మించుకుంటూ వచ్చిన సామ్రాజ్యం కుప్పకూలిందని, తన ప్రతిష్ట పూర్తిగా దెబ్బతిందని రజత్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. మాన్‌హట్టన్‌లోని ఫెడరల్ కోర్టు రజత్ గుప్తాను దోషిగా తేల్చింది. ఈ కేసులో ఇప్పటికే హెడ్జే ఫండ్ వ్యవస్థాపకుడు రాజ్ రాజరత్నం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మాజీ మెక్‌కెన్సీ అధిపతిపై భరారా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఆరోపణలు చేసిన ఏడాది తర్వాత రజత్ గుప్తాకు జైలు శిక్ష పడింది. తనపై ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేసిన తర్వాత రజత్ గుప్తా ఎఫ్‌బిఐ ముందు లొంగిపోయారు. గుప్తా గోల్డ్‌మాన్ సాచ్స్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ బోర్డు సీట్లను సాధించే స్థాయికి ఎదిగారు.