బహిరంగ మూత్ర విసర్జన...అడ్డంగా బుక్కైన కేంద్రమంత్రి..

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒకపక్క స్వచ్ఛ భారత్ అంటూ పలు కార్యక్రమాలు చేపడుతుంటే... మరోపక్క ఆయన పార్టీ నేతలే మోడీని చిక్కుల్లో పడేస్తున్నారు. ఇటీవలే బీజేపీ ఎంపీ ప్రియాంకా రావత్ సరయూ నదిలో ప్లాస్టిక్ బాటిల్ విసిరేసిన వీడియో బయటకు రావడంతో వివాదం రేగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మోడీ మంత్రి వర్గంలోని ఓ మంత్రే ఏకంగా బహిరంగ మూత్ర విసర్జన కు పాల్పడి అడ్డంగా బుక్కయ్యాడు. అసలు సంగతేంటంటే..కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌ సింగ్‌ కారు ఆపి సెక్యురిటీ గార్డుల సంరక్షణలో మూత్రవిసర్జన చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఇంకేముంది రాధా మోహన్‌ సింగ్‌ పై నెటిజన్లు ఒకటే కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు మోడీ స్వచ్ఛ భారత్ కోసం పాటు పడుతుంటే.. పార్టీ నేతలు ఇలాంటి పనులకు పాల్పడుతుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu