ఇంద్రాణి ముఖర్జియాను జైల్లో కొట్టారు...!
posted on Jun 29, 2017 11:18AM

ఇంద్రాణి ముఖర్జియా ప్రస్తుతం తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసులో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అదేంటంటే... జైల్లో ఉన్న ఇంద్రాణి ముఖర్జియాను జైలు అధికారులు కొట్టి హింసించినట్టు నివేదిక అందింది. ప్రస్తుతం ముంబైలోని బైకుల్లా జైల్లో ఉన్న ఇంద్రాణి కేసులో భాగంగా కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైన ఆమె జైలు అధికారులు తనపై దాష్టికంగా ప్రవర్తిస్తున్నారని..తనను తీవ్రంగా కొట్టారని ఆమె ఆరోపించారు. దీంతో వైద్య పరీక్షలకు న్యాయస్థానం అంగీకరించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇక ఇంద్రాణిని పరీక్షించిన వైద్యులు ఆమెను సుత్తి వంటి ఆయుధాలతో కొట్టారని, ఎముకలు మాత్రం విరగలేదని నివేదికను ఇచ్చారు.ఆమె చేతులపై, ఇతర అవయవాలపై గాయాలు ఉన్నాయని అన్నారు.