బీజేపీకి నేను ఐటెం గర్ల్ ని..!
posted on Jun 29, 2017 11:54AM

సమాజ్ వాదీ పార్టీ నేత అజంఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏదో ఒక దానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అలాగే ఇప్పుడు సైనికులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. మహిళలపై అకృత్యాలకు తెగబడే సైనికులపై తిరగబడాలని, సైనిక రేపిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని, వారి మర్మవయాలు కోసి పాడేయాలంటూ ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు ఆయనపై మండిపడ్డారు కూడా. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్న అజంఖాన్.. ‘నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది. నా కారణంగా ఆర్మీ నైతికత ఎందుకు దెబ్బతింటుంది? ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు వెళ్లినప్పుడే ఆర్మీ నైతికత దెబ్బతిన్నది’ అని అన్నారు. అంతేకాదు... ‘నేను బీజేపీకి ఐటెం గర్ల్‌గా మారాను. వారికి నేను తప్ప ఇంకా ఎవరు కనిపించడం లేదు మాట్లాడటానికి. అందుకే నా మీద ఫోకస్ చేశారు’ అని మండిపడ్డారు.