గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్.. దిల్ రాజు భేటీ ఆంతర్యమదేనా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త సినిమాల బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపునకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నో చెప్పిన నేపథ్యంలో దిల్ రాజు పవన్ కల్యాణ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సంక్రాంతికి విడుదల కానున్న గేమ్ ఛేంజర్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, బాలకృష్ణ నటించిన  డాకూ మహరాజ్ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో దిల్ రాజు, పవన్ కల్యాణ్ తో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  

అంతే కాకుండా హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకు దిల్ రాజే స్వయంగా నిర్మాత కావడంతో ఈ భేటీ పట్ల సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది.  విశ్వసనీయ సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించేందుకే దిల్ రాజు ఆయనతో భేటీ అయ్యారని అంటున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పవన్ కల్యాణ్ ఇచ్చే డేట్ ను బట్టి ఏపీలోనే నిర్వహించాలన్న మేగాస్టార్ చిరంజీవి సూచన మేరకే దిల్ రాజు పవన్ తో భేటీ అయ్యారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu