ఆప్ గెలిస్తే మాన్ సీఎం.. మ‌రి, కాంగ్రెస్ గెలిస్తే..?

పంజాబ్’లో అధికారాన్ని హస్తగతం చేసుకుని, జాతీయ స్థాయిలో జెండా ఎగరేసేందుకు ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్) మరో ముందదుగు వేసింది. ప్రస్తుతం పంజాబ్’లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి విషయంలో ఎటూ తెల్చుకోలేక తికమక పడుతుంటే, ఆప్, ప్రజాభిప్రాయ సేకరణ చేసి మరీ, ముఖ్యమత్రి అభ్యర్ధి పేరును ప్రకటించింది. 

ఆప్ అధికారంలోకి వస్తే, ముఖ్యమంత్రి ఎవరు అన్న సస్పెన్స్ కు ఢిల్లీ సీఎం, ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, తెరదించారు. ఆప్ సీఎం అభ్య‌ర్థిగా భ‌గ‌వంత్ మాన్ పేరును ఆయన  ప్రకటించారు. 
భగవంత్ మాన్ ప్రస్తుతం, లోక్ సభలో సంగ్రూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజానికి, మాన్ పేరును కేజ్రీవాల్ స్వయంగా ప్రతిపాదించారు. అయితే, ప్రజాభిప్రాయం ప్రకారమే ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఖారారు చేయాలనే ప్రతిపాదన భగవంత్ మాన్ నుంచే రావడంతో, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.  

ప్రజాభిప్రాయ సేకరణలో 93.3 శాతం మంది  మద్దుతు భగవత్ మాన్ కు లభించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరో వంక కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే విషయంలో ఇంకా సిగ పట్లు కొనసాగుతూనే  ఉన్నాయి. పీసీసీ చీఫ్ నవజ్యోతి సింగ్ సిద్దూ, ముఖ్యమంత్రి చన్నీల మధ్య పోటీ సాగుతోంది. ఈ నేపద్యంలో ఆప్’ ముందుగా ప్రజాభిప్రాయం  ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించడం ఆ పార్టీకి మరో ప్లస్ పాయింట్ అవుతుందని, పరిశీలకులు బావిస్తున్నారు.
 
ఇప్పటికే ఎన్నికల తేదీని కూడా ఈసీ ఖరారు చేసింది. ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఆమేరకు షెడ్యూలు కూడా విడుదల చేసింది. అయితే, ఫిబ్రవరి 16న గురు రవిదాస్‌ జయంతి కావడంతో ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్య లక్షలాది మంది ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి వెళ్తారని.. దీంతో ఓటు వేసే అవకాశం కోల్పోతారని పంజాబ్ ప్రభుత్వంతో పాటుగా రాజకీయ పార్టీలు పోలింగ్ వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి.ఈ నేపద్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 20న పోలింగ్‌ను నిర్వహించనున్నట్టు ప్రకటించింది.  

అదలా ఉంటే ఇప్పటివరకు విడుదల అయిన సర్వేలు అన్నీ, ఒకే మాట చెపుతున్నాయి.   పంజాబ్ లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశముందని పేర్కొన్నాయి. ఇదే సమయంలో ఇటీవల జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.. పోటీ చేసిన తొలిసారే అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో మరింత జోష్ నెలకొంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ అక్కడి కేడర్ లో జోష్ నింపడమే కాకుండా.. అనేక రకాల ఎన్నికల హామీలు ఇస్తున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ‌త అసెంబ్లీ పోరులో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లోని 117 సీట్ల‌లో 20 స్థానాల‌ను గెలిచింది.ఈ సరి సర్వే ల ప్రకారం 50 కి పిగ్ స్థానాలను  గెలుచుకుని అతి పెద్ద పార్టీగా నిలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ 40 ప్లస్ స్థాలతో రెండవ స్థానంలో ఉంటుంది. అకాలీ దళ్, బీజేపీ సింగల్ డిజిట్’కే ఎపరిమితం అవుతాయని సర్వేలు సూచిస్తున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా నెల రోజులకు పైగానే సమయం ఉంది .. ఈ  లోగా ఏమి జరుగుతుంది .. ఎవరి ఫేట్ ఎల్ మారుతుంది .. ఇప్పుడే చెప్పలేము.