నరేంద్ర మోడీ ‘ఆసియన్ ఆఫ్ ది ఇయర్’
posted on Dec 6, 2014 11:45AM

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. సింగపూర్‌కి చెందిన నంబర్ వన్ దినపత్రిక ‘ది స్ట్రెయిట్ టైమ్స్’ నరేంద్రమోడీని ‘ఆసియన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. ఈ పేరును ప్రకటించే ముందు సదరు పత్రిక ఎడిటర్ల బృందం గల సంవత్సర కాలంగా అధ్యయనం జరిపింది. నరేంద్రమోడీ ఆసియాలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా నిలిచారని సదరు పత్రిక పేర్కొంది. అభివృద్ధి దృష్టి ఉన్న నాయకుడిగా, ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాల నెలకొల్పడంలో మోడీ తనదైన ముద్ర వేసుకున్నారని ది స్ట్రెయిట్ టైమ్స్ పత్రిక ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని గత సంవత్సరం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, జపాన్ ప్రధాని షింజో అబే సంయుక్తంగా అందుకున్నారు. 2012లో మయన్మార్ అధ్యక్షుడు థీన్‌సేన్ అందుకున్నారు.