హైదరాబాద్‌లో హై అలర్ట్...

 

అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన డిసెంబర్ 6వ తేదీని అప్పటి నుంచి ‘బ్లాక్ డే’ అని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ ఆరో తేదీని బ్లాక్ డేగా పాటించబోతున్నట్టు ఎంఐఎం, ఎంబీటీ పార్టీలు పిలుపు ఇచ్చాయి. అయితే బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ మాత్రం డిసెంబర్ 6ని ‘విజయ దివస్’గా నిర్వహించాలని పిలుపు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది రెండు వర్గాల ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో పోలీసులు అప్రమత్తంగా వున్నారు. శనివారం నాడు పాతబస్తీలోని దుకాణాలను మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. పలు ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తోపాటు తెలంగాణ స్పెషల్ పోలీస్, ఆర్మ్‌డ్ రిజర్వ్ బలగాలను రంగంలోకి దిగాయి. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మరాదని ఈ సందర్భంగా పోలీసులు సూచిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu