విజయవాడ భవానీపురం పోలీసులు అదుపులో పోసాని
posted on Mar 8, 2025 12:25PM
టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీలో 17 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గత నెల పోసానిని హైద్రాబాద్ రాయదుర్గం నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓబులాపురం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ఆదేశం ప్రకారం రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అక్కడ్నుంచి పిటివారెంట్ పై నరసారావ్ పేట పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరు సబ్ జైలుకు తలించారు. పీటీ వారెంట్ పై ఆదోని పోలీసులు అరెస్ట్ చేసి కర్నూలు జైలుకు తరలించారు.
తాజాగా, పోసాని కృష్ణమురళిని విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయనను పీటీ వారెంట్ పై విజయవాడ తీసుకువచ్చారు. శనివారం ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు. కోర్టు రిమాండ్ విధిస్తే విజయవాడ జైలుకు లేదా మళ్లీ కర్నూలు జిల్లా జైలుకు తరలించనున్నారు.