బెయిలు షరతులు సడలించాలంటూ పిన్నెల్లి పిటిషన్
posted on Oct 26, 2024 10:15AM
.webp)
తన బెయిలు షరతులు సడలించాలంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసుతో పాటు దౌర్జన్యం, దాడి కేసులలో అరెస్టైన పిన్నెల్లికి కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
కండీషన్డ్ బెయిలపై బయట ఉన్న పిన్నెల్లి ఇప్పుడు తన బెయిలు షరతులు సడలించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తనే సింగపూర్ ప్రయాణానికి అనుమతించాలని, అలాగే సరెండర్ చేసిన పాస్ పోర్టును తిరిగి ఇప్పించాలని పిన్నెల్లి తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను కోర్టు శుక్రవారం కోర్టు విచారించింది. ఈ సందర్భంగా తన కుమారుడు ఉన్నత చదువుల కోసం సింగపూర్ వెడుతున్నాడనీ, తండ్రిగా తాను కూడా కుమారుడితో పాటు వెళ్లడానికి అనుమతించాలనీ కోరారు. అయితే పోలీసుల తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పడంతో కోర్టు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.