పోలవరం ప్రాజెక్టు కోసం రూ.6705 కోట్ల రూపాయలు
posted on Feb 28, 2025 10:35AM

ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2025-26లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర విత్తమంత్రి పయ్యావుల కేశవ్ భారీగా కేటాయింపు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు కోసం ఆయన 6 వేల705 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక జలజీవన్ మిషన్ కు 2, 800 కోట్ల రూపాయలు కేటాయించారు.
అలాగే వివిధ శాఖలు, రంగాలు, పథకాలకు ఆయన చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి..
వ్యవసాయ, అనుబంధ రంగాలు.. రూ.13,487 కోట్లు
పౌరసరఫరాల శాఖ.. రూ.3,806 కోట్లు
స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ.. రూ.1,228 కోట్లు
బీసీల సంక్షేమం.. రూ.47,456 కోట్లు
ఎస్సీల సంక్షేమం.. రూ.20,281 కోట్లు
ఎస్టీల సంక్షేమం.. రూ.8,159 కోట్లు
అల్పసంఖ్యాక వర్గాలు.. రూ.5,434 కోట్లు
మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం.. రూ.4,332 కోట్లు
వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం.. రూ.19,264 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య శాఖ.. రూ.3,156 కోట్లు
రోడ్లు, భవనాలు.. రూ.8,785 కోట్లు
యువజన, సాంస్కృతిక శాఖ.. రూ.469 కోట్లు
తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం.. రూ.10 కోట్లు
నవోదయ 2.0 .. రూ.10 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం.. రూ.3,486 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన.. రూ.500 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి.. రూ.300 కోట్లు
ఐటీఐ, ఐఐఐటిలు.. రూ.210 కోట్లు
దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన.. రూ.745 కోట్లు
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్.. రూ.10కోట్లు
ప్రకృతి సేద్యం ప్రోత్సాహం.. రూ.62 కోట్లు
ఇరిగేషన్ ప్రాజెక్టులు.. రూ. 11,314 కోట్లు
మత్స్యకార భరోసా.. రూ.450 కోట్లు