జయప్రద ఇంట విషాదం... సోదరుడు కన్నుమూత
posted on Feb 28, 2025 10:46AM
ప్రముఖ సినీ నటి, అలనాటి హీరోయిన్ జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు రాజబాబు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారం మధ్యాహ్నం రాజబాబు మరణించినట్లు జయప్రద తెలిపారు.
జయప్రద 14 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యారు. 1976లో కెరీర్ ప్రారంభించి దాదాపు 300 సినిమాల్లో నటించారు. 2005 ఆమె చివరి చిత్రం. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో అరంగేట్రం చేశారు. విభేధాల కారణంగా ఆమె సమాజ్ వాది పార్టీలో చేరారు. పార్టీ ప్రదాన కార్యదర్శి అమర్ సింగ్ వెన్నంటే ఉన్నారు. రెండుసార్లు ఉత్తర ప్రదేశ్ రాంపూర్ లోకసభ నుంచి ఎంపీ గా గెలుపొందారు. ఆయన మరణం తర్వాత జయప్రద స్వంత పార్టీని ఏర్పాటు చేసి విఫలమయ్యారు. ప్రస్తుతం ఆమె బిజెపిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఫౌజీలో ఆమె కీలకపాత్ర పోషించారు.