హోంశాఖకు రూ.84570 కోట్లు
posted on Feb 28, 2025 10:22AM
.webp)
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ లో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారీ కేటాయింపులు చేశారు. ఇందు కోసం రాష్ట్ర హోంశాకలకు 8570 కోట్ల రూపాయలు కేటాయించారు. గత ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిందనీ, జగన్ సర్కార్ తీరు కారణంగా పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతిందనీ పేర్కొన్న పయ్యావుల కేశవ్, దాని పర్యవశానంగా రాష్ట్రంలో సామాన్యులు ప్రశాంతంగా, భద్రంగా బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
పోలీస్ దళం ఆధునీకరణ, 6,100 మంది పోలీసు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ ఎలైట్ యాంటి నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ ఫోర్స్ మెంట్ (ఈగల్)' ఏర్పాటు, ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు, పెట్రోలింగ్ సహా పటిష్ట నిఘా కోసం పోలీస్ వాహనాల కొనుగోలు, గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు 'నవోదయం 2.0' కార్యక్రమం, ఆల్కహాల్ డీ-అడిక్షన్ సహా వ్యసనాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాల నిధులను కేటాయించారు.