దేవుడి పేరిట రాజకీయాలు చేస్తే..చూస్తూ ఊరుకోం

 

పవన్ కళ్యాణ్‌కి తమిళ రాజకీయాల్లో తొలి ఎదురు దెబ్బ తగిలిందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇలాంటి రాజకీయాలు చేస్తానని ముందుకొచ్చిన రజనీకాంత్  అక్కడ తన పొలిటికల్ ఖాతా తెరవకుండానే ప్యాకప్ చెప్పేశారు. ఆయన నాన్ లోకల్ కూడా కావడంతో.. అప్పట్లో శీమాన్ తదితరులు ఇక్కడ రాజకీయ పార్టీ పెడితే ఒప్పుకునేది లేదంటూ తెగేసి చెప్పారు. ఇప్పుడు పవన్ చూస్తే తమిళనాడు సంప్రదాయానికి విరుద్ధంగా ఆధ్యాత్మిక రాజకీయాల బాట పట్టారు.నిజానికి ఇక్కడ ఎంత ద్రవిడ వాదం ఉన్నా.. భక్తి ఏం తక్కువ ఉండదు. కరుణానిధితో సహా అందరూ ఇక్కడ సెంటిమెంట్లు ఫాలో అయ్యేవాళ్లే. కానీ విచిత్రమైన విషయమేంటంటే.. పైకి అందరూ ద్రవిడ వాదం వల్లె వేసేవారే. 

ఆ మాటకొస్తే బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కమల్ సైతం ద్రవిడవాదే. అలా అయితేనే ఇక్కడ నెగ్గుకు రాగలం.ఈ విషయం తెలీకుండా పవన్ ఇక్కడ తనదైన సనాతన్ మార్క్ పాలిటిక్స్ ప్లే చేస్తానంటూ కుదరదని అంటున్నారు తమిళులు. అందుకే సత్యరాజ్ నుంచి ఫస్ట్ వార్నింగ్ వచ్చింది. ఇది తర్వాతి రోజుల్లో చాలా చాలా ముదరబోతుంది. దానికి తోడు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ఇక్కడ బీజేపీ నుంచి ప్రచారం చేసేలా కనిపిస్తోంది. వీటిని ముందే గుర్తించిన తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన హవాకు ముందు నుంచే బ్రేకులు వేస్తున్నారు.ఈ రోజున దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తామంటే కుదరదని సత్యరాజ్ నుంచి ఒక హెచ్చరిక అయితే వచ్చింది. వచ్చే రోజుల్లో ఈ హెచ్చరికల తీవ్రత ఎలా ఉంటుందో తేలాల్సి ఉంది.