ఫోన్ ట్యాపింగ్‌తో సినీ తారల కుటుంబంలో చిచ్చు పెట్టారు : టీపీసీసీ
posted on Jun 25, 2025 3:16PM

మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్‌తో సినీతారల కుటుంబంలో చిచ్చు పెట్టారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంగళవారం రైతుభరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా పదేళ్ల బీఆర్ఎస్ పాలన..ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని అన్నారు. చివరకు సొంత బీఆర్‌ఎస్ పార్టీ నేతలనూ వదలేదని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు కేసీఆర్, కేటీఆర్ కు ఎవరిచ్చారని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. మా ప్రైవసీని దెబ్బతీసే హక్కు ఎవరిచ్చారు..? దేశ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ హేయమైన చర్య అని ఆయన తెలిపారు.
ఈ కేసులో ఎంత పెద్దవాళ్లు ఉన్నా శిక్ష పడాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీ చర్చించి నిర్ణయం ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ 18 నెలల పాలన గోల్డెన్ పిరియడ్ అని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ నేతలు నోరు మెదపడం లేదని ఆయన తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలు, జుబ్లీహీల్స్ ఉపఎన్నికకు పార్టీని సన్నద్ధం చేసేలా పలు కీలక నిర్ణయాలుతో వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహలపై వరుస సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు గెలిచేది కూడా తామేనని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు