పవన్ నెంబర్ 1, మహేష్ నెంబర్ 2

 

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మరియు ప్రిన్స్ మహేష్ బాబులకున్న ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిరువురి సినిమాలకి ఇప్పుడు మన రాష్ట్రంలోనే గాక పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో, విదేశాలలో కూడా చాలా డిమాండ్ ఉంది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలలో స్థిరపడిన లక్షలాది ప్రవాసాంధ్రుల ఆదరణ పొందుతున్న కారణంగా వీరి సినిమాలు హాలివుడ్ సినిమాలకు కూడా గట్టి పోటీనిస్తున్నాయి. అందుకే ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రముఖ అమెరికన్ దినపత్రికలు కూడా వీరి సినిమాల గురించి వ్రాయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

 

ఇటీవల న్యూయార్క్ టైమ్స్ భారత్ కి చెందిన 10 టాప్ హీరోల కోసం నిర్వహించిన ఒక ఆన్ లైన్ సర్వేలో బాలివుడ్ నటుడు షారూక్ ఖాన్ నెంబర్:1 స్థానంలో నిలువగా, పవన్ కళ్యాణ్-5, మహేష్ బాబు-6 స్థానాలను కైవసం చేసుకొన్నారు. ఆ పత్రిక సర్వే ప్రకారం సల్మాన్ ఖాన్-2, అక్షయ్ కుమార్-3, హృతిక్ రోషన్-4, పవన్ కళ్యాణ్-5, మహేష్ బాబు-6, విజయ్-7, అమీర్ ఖాన్-8, రణబీర్ కపూర్-9, మరియు అజయ్ దేవగన్-10వ స్థానంలో నిలిచారు. ఈ ప్రకారం చూస్తే దక్షిణాది సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ నెంబర్ 1 స్థానంలో మహేష్ బాబు నెంబర్ 2స్థానంలో ఉన్నట్లవుతుంది.

 

అయితే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్న తమిళ్ హీరోలు రజని కాంత్ మరియు కమల హస్సన్ పేర్లు ఈ లిస్టులో ఎందుకు కనబడలేదో తెలియదు మరి.