ఛత్తీస్గఢ్ మరో భారీ ఎన్కౌంటర్.. 20 మంది నక్సల్స్ మృతి!

వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో తీవ్రవాదం లేకుండా చేయాలన్న లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటికే పలు ఎన్ కౌంటర్లలలో వందల మంది మావోయిస్టులు హతమయ్యారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత, యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆపరేషన్ కగార్ కు కామా పెట్టిన కేంద్రం.. ఇప్పుడు అక్కడ ఉద్రిక్తతలు ఒకింత సడలగానే మళ్లీ వేగం పెంచింది.

తాజాగా బుధవారం (మే 21) ఉదయం ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో20 మంది నక్సలైట్లు మరణించారు. ఎన్ కౌంటర్ కొనసాగుతోందని సమాచారం. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఒకరు మరణించినట్లు చెబుతున్నారు.  సంఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలిస్తున్నట్లు సమాచారం. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu