ఈసారి నాగ్ తడాఖా చూపిస్తాడా...?

 

నాగార్జున హీరోగా నటించిన "భాయ్" చిత్రం ఇటీవలే విడుదలై అట్టర్ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే నాగార్జున మాత్రం తన సినిమాలు తను చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం "మనం" చిత్ర షూటింగ్ లో ఉన్న నాగార్జున త్వరలోనే మరో చిత్రం నటించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. "తడాఖా" చిత్రంతో మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు బాబీ దర్శకత్వంలో నాగార్జున ఓ చిత్రం చేయనున్నాడని తెలిసింది. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నాడట. ప్రస్తుతం నాగార్జున కోసం బాబీ ఓ పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడట. ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.