ఉత్తరాఖండ్ లో విరిగిపడ్డ కొండచరియలు

ఉత్తరాఖండ్ లో కొండ చరియలు విరిగిపడ్డాయి. పిలోరాగఢ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడటంతో దాదాపు 180 మంది కైలాస్ మానసనరోవర్ యాత్రికులు మార్గ మధ్యంలో చిక్కుకుపోయారు. యాత్ర మార్గంలో కొండ చరియలు విరిగి పడటంతో వారు ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది.

కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. రోడ్డు క్లియర్ చేయడానికి బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ సిబ్బంది రంగంలోకి దిగా యుద్ధ ప్రాతిపదికన రోడ్లు క్లియర్ చేస్తున్నారు.  కరోనా  మహమ్మారి కారణంగా 2020లో కైలాస మానస సరోవర్ యాత్రను అధికారులు నిలిపివేశారు.

ఆ తరువాత కరోనా తగ్గినప్పటికీ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల కారణంగా భారత్, చైనా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో అప్పటి నుంచి ఈ యాత్ర జరగడం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్యా జరిగిన చర్చలు ఫలించడంతో ఐదేళ్ల తరువాత ఈ ఏడాది కేలాస మనస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu