పవన్ కు అస్వస్థత.. వైద్య పరీక్షలు, చికిత్స కోసం హైదరాబాద్ కు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. గత నాలుగు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. అసెంబ్లీకి కూడా హాజరు కాలేదు. మంగళగిరిలో ఉంటూనే నాలుగు రోజులుగా చికిత్స చేయించుకుంటున్నారు. అయినా జ్వర తీవ్రత తగ్గకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాద్ కు బయలు దేరారు.

ఈ రోజు హైదరాబాద్ లో ఆయన వైద్య పరీక్షలు చేయించుకుంటారు. జనసేనాని అస్వస్థతతో ఉన్నారన్న వార్తతో జనసైనికులతో పాటు ఆయన అశేష అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఆయన ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఆందోళనా అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగానే జ్వరం వచ్చిందని అంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu