పఠాన్‌కోట్‌లో కలకలం..సైన్యం తనిఖీలు


పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో మళ్లీ కలకలం రేగింది. నిన్న రాత్రి సైనిక దుస్తులున్న మూడు బ్యాగులు లభించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ బ్యాగ్‌లు ఎవరివి అన్న కోణంలో విచారణ చేపట్టి..అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టారు. పోలీసులు, భద్రతా బలగాలు గల్లీ గల్లీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండటంతో మళ్లీ ఏ ఉపద్రవం ముంచుకొచ్చిందోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎయిర్‌‌ఫోర్స్‌ బేస్‌పై దాడి తర్వాత సైన్యం అప్రమత్తంగా ఉండటంతో నగరంలో కాస్త అలజడి తగ్గింది. అయితే గత నెల రోజుల నుంచి మళ్లీ అనుమానాస్పద కదలికలు ఎక్కువయ్యాయి. తరచుగా గుర్తు తెలియని బ్యాగులు లభించడం..పలువురు వ్యక్తులు సంచరిస్తుండటంతో సైన్యం రంగంలోకి దిగి భద్రతను కట్టుదిట్టం చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu