ఢిల్లీ యూనివర్శిటీలో ఐఎస్ఐఎస్

వరుసగా వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తున్న ఢిల్లీ యూనివర్శిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు అనుకూలంగా నినాదాలు కనిపించడం సంచలనం రేపింది. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గోడలపై ఐఎస్‌కు అనుకూలంగా రాసి ఉన్న ఈ నినాదాలను మొదట అక్కడి విద్యార్థులు చూసి ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీకి సమాచారమిచ్చారు. అనంతరం వారు నార్త్ క్యాంపస్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొందరు కావాలనే కాలేజీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu