తాత మరణం..బాధతోనే బౌలింగ్

టీమిండియా స్పిన్నర్ అశ్విన్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తాతయ్య ఎస్. నారాయణసామి అనారోగ్యంతో మరణించారు. అయితే దురదృష్టవశాత్తూ అశ్విన్‌కు తాతగారి కడసారి చూపు దక్కలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అశ్విన్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉండటంతో భారత్‌కు రాలేకపోయాడు. నిన్న నారాయణసామి పార్ధీవదేహానికి కుటుంబసభ్యులు సంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియలు నిర్వహించారు. తాతయ్య మరణవార్తను విన్న అశ్విన్ ఆ బాధను దిగమింగుకుని నిన్న న్యూజీలాండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో బౌలింగ్ చేశాడు. ఇక అశ్విన్ తాతయ్య నారాయణసామి సదరన్ రైల్వేలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందారు. ఈయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం..అశ్విన్ క్రికెటర్‌గా ఎదగడంలో ఆయన పాత్ర చాలా కీలకం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu