అవసరమైతే రాజీనామా వెనక్కి తీసుకుంటా...

 

తమిళనాడు ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శశికళపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ ఆస్పత్రిలో ఉన్నప్పుడు శశికళ తప్ప ఎవరూ చూడలేదు.. అమ్మ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయి.. అమ్మ మృతిపై రిటైర్డ్ జడ్జ్ తో విచారణ జరిపిస్తామని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు కోరుకున్నట్టైతే.. రాజీనామా వెనక్కితీసుకోవడం తప్పనిసరైతే తీసుకుంటా.. ఈ విషయంపై గవర్నర్ చెన్నైకి రాగానే మాట్లాడతా అని అన్నారు. పార్టీకి నేనెప్పుడూ ద్రోహం చేయలేదు..పార్టీకి వ్యతిరేకంగా నేనెప్పుడూ మాట్లాడలేదు.. అప్పుడైనా..ఇప్పుడైనా అమ్మకు నేను నమ్మిన బంటునే..అమ్మ బిడ్డగా నాకు ఉండే మర్యాద ఎప్పుడూ ఉంటుంది.. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా నేనెప్పుడూ పార్టీకి విధేయుడిగానే ఉన్నా అని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu