శశికళ, పన్నీర్ సెల్వం కొట్లాట... మా పాత్ర ఏం లేదు...
posted on Feb 8, 2017 10:26AM
.jpg)
తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్న వేళ ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీలో నెలకొన్న విబేధాలకు కారణం డీఎంకే పార్టీ అని.. పన్నీర్ సెల్వం వెనుక డీఎంకే హస్తం ఉందని ఆరోపించారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై డీఎంకే నేతలు స్పందించి అన్నాడీఎంకే పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్ మాట్లాడుతూ.. వాళ్ల పార్టీలో జరిగే కుమ్ములాటలకు తామెలా బాధ్యులమవుతామని? ప్రశ్నించారు.వాళ్ల పార్టీ నేతలను అదుపులో పెట్టుకోలేక మమ్మల్ని ఎందుకు బద్నాం చేస్తున్నారని నిలదీశారు. ఇంకా ఈ వ్యాఖ్యలపై డీఎంకే నేత స్టాలిన్ కూడా స్పందించారు. అన్నాడీఎంకే పార్టీలో విబేధాలకు తాము ఎలా కారణమవుతామని.. ముందు వాళ్ల నేత, అపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం చేసిన ఆరోపణలపై శశికళ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా తమిళనాడు రాజకీయాలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా స్పందించారు. తమిళనాడులో నెలకొన్న తాజా పరిస్థితులపై గవర్నర్ అధ్యయనం చేస్తున్నారని పన్నీర్ సెల్వం, శశికళ మధ్య వివాదంలో కేంద్రం పాత్ర లేదని స్పష్టం చేశారు.