నన్ను తప్పించే అధికారం ఎవరికి లేదు...

 

తమిళనాడు రాజకీయాలు వేడి వేడిగా తయారవుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు ఆపద్దర్మ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తర్వాత పేరుకు తనను సీఎంగా నియమించినా..అడుగడుగునా అవమానించారని, చివరకు తనతో బలవంతంగా రాజీనామా చేయించారని పన్నీర్  సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అన్నాడీఎంకే కోశాధికారి పదవి నుంచి పన్నీర్ సెల్వంను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ తొలగించడంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమ్మ నియమించిన కోశాధికారి పదవి నుండి నన్ను తప్పించే అధికారం ఎవరికి లేదని ఆయన అన్నారు. అమ్మ పార్టీని రక్షించాల్సిన బాధ్యత నాపై ఉంది... డీఎంకేతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు అని తేల్చి చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu