మరో ప్రపంచ యుద్ధం!

 

1945లో కొరియా దేశం ఉత్తర, దక్షిణ కొరియాలంటూ రెండు దేశాలుగా విడిపోయినప్పటికీ... ఆ రెండు దేశాల మధ్యా సంబంధాలు ఉప్పునిప్పుగా సాగుతున్నాయి. ఒక సందర్భంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాని పూర్తిగా ఆక్రమించుకోగా ఐక్యరాజ్యసమితి బలగాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పడు మళ్లీ అలాంటి పరిస్థితులు పునరావృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరకొరియా తమ మీద యుద్ధం చేసేందుకు సర్వ సన్నాహాలన్నీ చేసుకుందని నిన్న దక్షిణకొరియా ఆరోపించింది. అందుకోసమే గత నెల ఆ దేశం హైడ్రోజన్‌ బాంబుని సైతం పరీక్షించిందనీ, ఖండాంతర క్షిపణులను సైతం సిద్ధం చేసుకుంటోందనీ దక్షిణ కొరియా వాదిస్తోంది.

 

ఈ రోజులలో యుద్ధమన్నది పెద్ద మాటే అయినప్పటికీ, దక్షిణ కొరియా భయాలను కొట్టిపారేసేందుకు కూడా లేదు. పైగా ప్రస్తుతం ఉత్తర కొరియాను ఏలుతున్న ‘కిమ్ జోంగ్‌’ దుండుకుతనానికి పెట్టింది పేరు. దాంతో దక్షిణకొరియాకు అనుకూలంగా ఇప్పటికే అమెరికా తన యుద్ధవిమానాలను ఆ దేశానికి మళ్లిస్తోంది. మరోవైపు ఉత్తర కొరియాకు మద్దతుగా నిలిచేందుకు ఎప్పటిలాగానే చైనా సిద్ధంగా ఉంది. ఈ యుద్ధం కనుక వాస్తవ రూపం ధరిస్తే అటు చైనా, ఇటు అమెరికాలతో అది ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం లేకపోలేదు. ఈసారి హైడ్రోజన్‌ బాంబులు కూడా ఉన్నాయి మరి!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu