కిస్సూ,, ఆ డ్రెస్సూ తప్ప... ఇంకేదైనా ఓకె
posted on Dec 29, 2013 1:10PM

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షిసిన్హా ఓ నిర్మాతకు నో చెప్పడానికి కారణం ఇప్పుడు అక్కడ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. కిస్సింగ్ సీన్లు, బికినీ సీన్లు ఉన్న ఓ సినిమా ఆఫర్‌ని ఈ అమ్మడు ఛస్తే చేయను పొమ్మందట. మరి లుటేరా సినిమాలో అంతగా రణవీర్‌తో హత్తుకుని ఒత్తుకుపోయావ్‌గా అని అడిగితే... అలా ఎంతగా కిందా మీదా పడినా పర్లేదు కానీ... పెదాలు కలపమన్నా, బికినీ వేసుకోమన్నా నా వల్ల కాదని తేల్చి చెప్పేసిందట. అసలు లుటేరాలో కూడా ముద్దు సీన్ ఉండాల్సిందే కానీ... తానే ఒప్పుకోలేదని అందుకే దర్శకుడు ఆ శ్రుంగార సన్నివేశాన్ని మరింత ఘాటుగా చిత్రీకరించాడని వివరించింది. తన తల్లి, తండ్రి ఇంకా కుటుంబ సభ్యులంతా కలిసి చూడదగ్గ సినిమాలే తాను చేస్తానని ఈ 26ఏళ్ల బొద్దు సుందరి ప్రకటించింది. తాము చేస్తున్న ‘సెక్స్’పోజింగ్‌ను తప్పు పడుతున్నట్టుగా ఉన్న సోనాక్షి మాటలు విని... ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న హాలిడే చిత్రంలో అక్షయ్‌తో ఎంత పవిత్రమైన సన్నివేశాలున్నాయో చూసి అప్పుడు చెబుదామని పోటీ హీరోయిన్లు కసిగా పళ్లు నూరుకుంటున్నారట.