జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్‌ షా

 

కేంద్ర పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్‌ వినాయక్‌నగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వింద్ సహా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పసుపు ఉత్పత్తులను హోంమంత్రి  పరిశీలించారు. అంతకుముందు హైదరాబాదులోని బేగంపేట నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్‌కు బయలుదేరిన అమిత్ షా.. కలెక్టరేట్ గ్రౌండ్‌కు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం వరకు చేరుకున్నారు. 

అనంతరం ఆయన పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా ఎక్కడ ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బోర్డు కార్యాలయంలో ఏర్పాటుచేసిన పసుపు సంబంధిత ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే దంపాల్ సూర్యనారాయణ గుప్త, జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu