కేసీఆర్ క్షమించినా యెల్లో మీడియాను మేము వదిలిపెట్టం : జగదీష్ రెడ్డి
posted on Jun 29, 2025 2:53PM

మాజీ సీఎం కేసీఆర్ క్షమించినా యెల్లో మీడియాను మేము వదిలిపెట్టమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మహా న్యూస్ చానల్ మీద జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే..ఇంకో రెండు, మూడు ఉన్నాయి.. వాటి పని కూడా చేస్తామని జగదీష్ రెడ్డి అన్నారు మా దాడి వేరే విధంగా ఉంటది.. ఏ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆంధ్ర నుంచి తెలంగాణను విడదీశాడు అనే కోపంతోనే ఈ దాడులు జరుగుతున్నాయిని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంవత్సర కాలంగా మీ చెంచా గాళ్లు ప్రభుత్వాన్ని పాలిస్తున్నామని ఆ స్లాటర్ హౌసులను వదిలిపెట్టమని జగదీష్ రెడ్డి వెల్లడించారు. తమ పిటిషన్లపై ప్రేక్షక పాత్రపోషించే పోలీసులు.. తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.రాజకీయ పార్టీలుగా మేమూ మేమూ తేల్చుకుంటాం. మీడియా అసత్య ప్రచారాలెందుకు. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పైనా మీ ప్రేలాపనలు. ఉద్యమం నుంచి వచ్చినోళ్లం కేసులకు భయపడతామా. మహా న్యూస్‌పై దాడి చేశారని ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌పై అక్కసుతో అదేపనిగా పెట్టుకొని దాడులు చేస్తున్నారు.
మీడియా ముసుగులో మీ ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు. బిన్ లాడెన్ లాగా ఎక్కడ దాక్కున్నా పట్టుకొని మీపని చెప్తాం. సంవత్సర కాలంగా మీ చెంచా గాళ్లు ప్రభుత్వాన్ని పాలిస్తున్నారు. వాళ్లను అడ్డం పెట్టుకుని నడుపుతున్న స్లాటర్ హౌసులను వదిలిపెట్టం. మా దాడి వేరే విధంగా ఉంటది. కేసీఆర్‌ది మొదటినుంచి గొప్ప క్షమాగుణం. ఆయన క్షమించినా మేము క్షమించం. భేషరతుగా మహా న్యూస్ యాజమాన్యం కేసీఆర్, కేటీఆర్‌కు క్షమాపణ చెప్పాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.