బీజేపీ ఎంపీ రఘునందన్‌కు మరోసారి చంపేస్తామని బెదిరింపు కాల్

 

మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి చంపేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. మరికాసేపట్లో చంపేస్తామని.. ఆపరేషన్ కగార్ ఆపాలని బెదిరించినట్లు తెలుస్తోంది. తమ టీంలు హైదరాబాద్‌లో ఉన్నాయని.. దమ్ముంటే కాపాడుకోవాలని సవాల్ విసిరారు. రఘునందన్ 2 రోజుల క్రితం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో కాలికి శస్త్ర చికిత్స  చేయించుకున్నారు. 

మరోవైపు జూన్ 23న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. ఏపీ మావోయిస్టు కమీటీ హత్యకు ఆదేశించినట్లు రెండు సార్లు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరించారని పేర్కొన్నారు. తన హత్యకు 5 బృందాలు రంగంలోకి దిగినట్లు వారు తనకు చెప్పినట్లు ఎంపీ రఘునందన్ తెలిపారు