ఏకే 47 గ్రేహౌండ్స్‌ది: సీపీ

 

హైదరాబాద్ కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు దగ్గర అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ మీద గుర్తు తెలియని వ్యక్తి ఏకే 47తో కాల్పులు జరిపిన సంఘటన సంచలనం సృష్టించింది. దుండగుడు వదిలి వెళ్ళిన ఏకే 47, బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగుడి ఆచూకీని కనిపెట్టడానికి పోలీసు జాగిలాలు రంగంలోకి దిగాయి. కాగా ఈ అంశం మీద హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌ స్పందించారు. ఆయన కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. దుండగులు ఉపయోగించిన ఏకే 47 గన్ ఏడాది క్రితం గ్రేహౌండ్స్ పోలీసుల దగ్గర చోరీకి గురైందని చెప్పారు. గ్రేహౌండ్స్ కమాండర్ శ్రీనివాస్ గత ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన ఈ గన్ పోగొట్టుకున్నట్టు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర ఉపయోగించిన గన్ అదేనని సీపీ తెలిపారు. ఈ కేసును ఈరోజు సాయంత్రం లోగా ఛేదిస్తామని ఆయన అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu